![]() |
![]() |

బుల్లితెర మీద శ్రీదివ్య అంటే ఎవరో తెలీదు కానీ కార్తీకదీపం ప్రియమణి అంటే చాలు పొడవాటి జడ, అందమైన స్ట్రక్చర్, మ్యాచింగ్ వస్తువులు టోటల్ గా క్లాసీ పనిమనిషి గుర్తొచ్చేస్తుంది కదా. కార్తీకదీపం సీరియల్ ఐపోయినా అందులో విలన్ మోనిత ఇంట్లో ఉండే పనిమనిషి ప్రియమణిని ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు ఈ అందమైన పనిమనిషి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. సీరియల్ లో పేరుకే పని మనిషి రోల్ కానీ బయట చూస్తే ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 68 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో గ్లామరస్ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాన్స్ అటెన్షన్ ని తన వైపు తిప్పుకుంటోంది ఈ అమ్మడు.
ఇక శ్రీదివ్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటో ఒకటి రిలీజ్ చేసింది. బాత్ టబ్‌లో పడుకుని మంచి కిక్కిచ్చే ఫోటో అది. ఆ ఫొటో వైరల్ అవుతోంది అంతేకాదు కామెంట్ల కూడా బాగా పేలుతున్నాయి. "ఎప్పుడో చెప్పాం కదా.. నువ్వు హీరోయిన్ మెటీరియల్ అని.. చంపేశావ్ పిల్లా" అంటూ ఆమె ఫొటోకి తెగ లైక్‌లు ఇస్తూ మంచి హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. శ్రీదివ్య.. కార్తీకదీపం సీరియల్‌తో పాటు.. మహలక్ష్మి, పంచెవన్నెల చిలక లాంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. పుష్ప మూవీలో కూడా పని మనిషి పాత్రలో కనిపించింది శ్రీదివ్య. ఎన్ని సీరియల్స్ లో నటించినా కార్తీక దీపంలో వచ్చినంత పేరు ఎక్కడా రాలేదు. ఏ డైరెక్టర్ కంట్లో అన్నా పడకపోతానా మంచి మూవీ ఛాన్స్ ని అందుకోలేకపోతానా అంటూ శ్రీదివ్య మాత్రం తన రేంజ్ తాను దూసుకుపోతోంది.
![]() |
![]() |